
టింగ్..టింగ్..ఆకాశవాణి విజయవాడ ..ఇప్పుడు భక్తి సంగీతం వింటారు..
ఇలా మొదలయ్యే నా చిన్నప్పటి రోజులు..
రేడియోలో వచ్చే కార్యక్రమాలతో నా నిత్యక్రు(ఇక్కడ పెట్టాల్సిన సరైన వత్తు లేఖిణిలో లేదు)త్యాలు అనుసంధానం అయిపొయేవి..
సమయం 6 గంటల 45 నిమిషాలు..ఇప్పుడు పాడి పంటలు..అని వినగానే స్నానానికి పరుగు..
ఏమి రామయ్యా దీర్ఘంగా అలోచిస్తున్నావు ..చార్మినార్ రేకులు..
నువాక్రాన్ ..ఆ తర్వాత..
రైతుకు చెలిమి పంటకు బలిమి నాగార్జునా యూరియా..
ప్రాంతీయ వార్తలు..
ఆకాశ వాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది .............
................................................................................................................................
ఇయం ఆకాశవాణి సంస్క్రుత వార్తాహః శూయనితాం ..ప్రవాచికా బలదేవానందసాగర . అనగానే ట్యూషన్ కి పరుగులు..
దీనికి మేము ఒక పేరడి..ఇలా..
ఇయం ఆకాశవాణి సంస్క్రుత వార్తాహః శూయనితాం ..ప్రవాచికా బలదేవానందసాగర..ప్రధాన మంత్రి నామ్నీం నాం ఇందిరాగాంధీ నమో నమః..ఇచ్చం విమానం పుచ్చయతిః ము.... మూడున్నర భవంతుః..
ఆ తర్వాత వచ్చే సంస్క్రుత పాఠం..దాని ముందు వచ్చే ఒక శ్లోకం ..చాల బాగుంటుంది..
తర్వాత ఏప్పుడొ మళ్ళీ ఆకాశవాణి విజయవాడ ..జనరంజని శ్రోతలు కోరిన తెలుగు చిత్రగీతాలు అన్నప్పుడు రేడియో వినేవాడిని..అలా పాటలూ వింటూ భోజనం ముగించి స్కూలికి పరుగు..
మళ్ళీ కార్మికుల కార్యక్రమం , ప్రాంతీయ వార్తలు ..స్కూలు కి డుమ్మా కొడితే మధ్యాహ్న బాలల కార్య క్రమం..
ఇక స్కూల్లో ఊపిరి సలపని చదువులు ..డ్రిల్లు..ఎన్ సి సి ..ఇంటికి చేరి మళ్ళీ ట్యూషన్ ..
ఇక రాత్రికి ఇంటికి చేరి భొజనం ముగించి శ్రధ్ధగా మళ్ళీ రేడియో..
ఆకాశవాణి ..ఇప్పుడు నీరాజనం శీర్షికన "ఆఖరి ఫొరాటం" చిత్రం పై సమీక్ష వింటారు..అలా ఆ చిత్రం లోని పాటలు కొన్ని డైలాగులు వేసేవారు..
ఆ కార్యక్రమం వింటూ నిద్రలోకి జారుకునే వాళ్ళం..
ఇలా రేడియో మా దినచర్యలో ఒక భాగంగా ఉండేది..
( పై చిత్రం గూగుల్ మఱియు సరాహ్నా.వర్డుప్రెస్సు.కాం వారి సౌజన్యముతో )
బాగుంది, మంచి జ్ఞాపకాల్ని తట్టి లేపారు. నా చిన్నతనం కూడా సరిగ్గా అలాగే గడిచింది.
రిప్లయితొలగించండికాలేజీలో చదువుతున్నప్పుడు సంస్కృత వార్తలకి నేను కంపోజ్ చేసి చదివే పేరడీ ఇలా ఉండేది.
ఇయం ఆకాశవాణీ. సంప్రతి వార్తాః శ్రూయన్తామ్. ప్రవాచకో బలదేవానన్ద సాగరః. గత రాత్రౌ నవ దిల్యాం ఏకస్మిన్ భీషణ బమ్ విస్ఫోటనే ప్రధానమంత్రిః శ్రీ XXXXXX మహోదయః దశాధికైః అంగరక్షకైః సహ దుర్మరణం గతః. ఇతి వార్తాః.
సంస్కృత పాఠం ముందు వచ్చే శ్లోకం ఇదీ -
కేయూరాణి న భూషయన్తి పురుషం హారా న చన్ద్రోజ్జ్వలాః
న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయన్తే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం ||
ఈ శ్లోకాన్ని ఇప్పటికీ రేడియ్ స్టైల్లోనే చదువుతాన్నేను. :-)
@నాగమురళి గారు,
రిప్లయితొలగించండిఆ శ్లోకం గుర్తు చేసినందుకు ధన్యవాదాలు..
ఈ శ్లోకం ట్యూన్ ఎప్పుడు నోట్లొ ఆడుతూ ఉంటుంది..కానీ ఇప్పుడు చక్కగా రేడియోలో వచ్చేటట్టే శ్లొకం చదవగల్గుతున్నాను..
@నైమిష్ గారు
రిప్లయితొలగించండి:) ఆకాశవాణి... ఒక ఉత్తమ ఆభిరుచి.. చాలా గుర్తు చేసారు.. నాకు ఒకటే పాట(నాలుగు చరణాలు) బాగా గుర్తు, బాగా నచ్చి హం చేసేవాడిని కాబట్టి. అది
"
కనుల మాటున స్వప్నాలు,
పెదవుల చాటున భావాలు
కనులు తెరిచినా, పెదవులు మూసినా ప్రపంచమంతా అయోమయం.
"
ఎక్కడొ బుర్రలో ఉన్నదాన్ని తవ్వి ఇక్కడ పెట్టా, పై దాంట్లో తప్పులు ఉండొచ్హు. ఇది ఏ కార్యక్రమం ముందో గుర్తురావట్లేదు? యువరంజని ముందేనా?
@ నాగమురళి గారు
శ్లోకం బాగా గుర్తుందే మీకు. నేను ఓ రెండు మూడు సార్లు వినుంటా అంతే!.
మంచి అలవాట్లు/అభిరుచులు బాల్యంలొనే మొగ్గ తొడగితే అవి చివరివరకూ ఇలా తీపి గుర్తులుగా మిగులుతాయి. మీరు అదృష్టవంతులు.
@రాజేష్ జి గారు, ధన్యవాదాలు..
రిప్లయితొలగించండినిజంగానే నాగమురళి అద్రుష్టవంతుడు..
మీరు హం చేసే పాట కూడా గుర్తుంది..కాని అది ఏ కార్యక్రమానిదో తెలీదు...
రేడియో వినటం ఎప్పటికీ ఒక మంచి అభిరుచే..
నా మనసు పొరల్లో ఇంకా కొన్ని కార్యక్రమాలు దొర్లుతున్నాయి..వాటిలో "హావామహల్" ఒకటి..అప్పట్లో హిందీ అర్థం కాకపొయినా వింటూ ఉండేవాడిని..
మూడో లైన్ తిరగబడినట్లుంది :)
రిప్లయితొలగించండి"కనులు {మూసినా}, పెదవులు {తెరిచినా} ప్రపంచమంతా అయోమయం."
ఇంతే అనుకుంటా.చాలా లోతైన అర్ధం ఉంది అందులో.
ఇంకొక మధుర కార్యక్రమం "ఈ మాసపు పాట"..వారంలో ఒకరొజు ఈ కార్యక్రమం నాలుగు వారాలు వచ్చేది..ఈ కార్యక్రమన్ని క్రమం తప్పకుండా వినే శ్రోతలకు నాలుగో వారానికి పాట కంఠస్తం వచ్చేసేది..
రిప్లయితొలగించండినిజం చెప్పాలంటే లలిత సంగీతానికి ఆకశవాణి పెద్దపీట వేసింది..
నాకు నచ్చిన కొన్ని లలిత గీతాలు ::
1) ఓహో ఓహో వసంతమా
2) మెరుపులు పూవుల దండగా మబ్బులు మెత్తని దిండుగా
3) అమ్మ దొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగా
ఇప్పటికి గుర్తున్నవి ఇవి..
.......
$ ఓహో ఓహో వసంతమా..
రిప్లయితొలగించండిచాలా బాగుంటుంది ఈపాట.. లలితముగా :) దూరదర్సినిలొ ఈ పాటకి దృశ్యం కూడా కలిపించారు.
అలాగే ఇంకోటి బాగ నే విన్నది
"
తుమ్మేదలున్నయ్ ఏమిరా..
దాని కురుల..
ఓరోరి మొగుడా.. వయ్యారి మొగుడా
"
:)
సంగీతం.. అందులొ మురళీ గానం చాలా బావుంటుంది. మీరు ఇక్కడ వినవచ్చు http://surasa.net/music/lalita-gitalu/contrib.php
జీవనడోలిక
రిప్లయితొలగించండిఅని టీనేజర్ల మానసికస్థితిలపై ఓ సీరియల్
ఆ కార్యక్రమం పాటలో :
కన్నుల చాటున భావాలు
పెదవుల చాటున స్వప్నాలు
కన్నులు తెరచిన (?)
పెదవులు విప్పిన (?)
ప్రశ్నలు ... ప్రశ్నలు
అని ఉండేది. సరే! పైన వ్యాఖ్యల్లో జ్ఞాపకం
చేసుకున్న పాట కాదు - అయినా ఎందుకో
వ్రాయాలనిపించింది. ఇక మాగంటి సైటులో
కొన్ని రేడియో కార్యక్రమాలు లభిస్తున్నాయి.
చూస్తున్నారా - అదే వింటున్నారా ఎవరైనా
మీరూ రేడియోవారేనా. బావుందండీ. అయితే మా నాన్నగారి వాయిస్ తెలిసే ఉంటుంది. నా బ్లాగ్లో "నాన్న"లేబుల్లో ఒక టపాలో ఆయన వాయిస్ ఉంటుంది. వీలైతే వినండి.
రిప్లయితొలగించండిత్రుష్ణగారు రేడియో రామం గారి గురించి తెలియని రేడియో ప్రియులు ఎవరైనా ఉంటారా చెప్పండి..మీ నాన్న గారి వాయిస్ మాకు చాలా సుపరిచితం...
రిప్లయితొలగించండిచాలా మంచి టపా. బాల్యాన్ని గుర్తు చేశారు.
రిప్లయితొలగించండి:) good one.
రిప్లయితొలగించండి