25, జనవరి 2011, మంగళవారం

ఇది నిఝంగా కధే !!

మళ్ళీ అదే నంబరునుండి ఫోను..ఇది రావటం ఈ రొజు పదో సారి..ఆఫీసులో వరుస క్లయింట్ విజిట్ లతో సతమతమవుతూ ఊపిరి సలపనంత పనితో ఉన్నప్పుడే ఈ ఫోన్లు కూడా..ఫోన్ని సైలెంట్ మోడ్ లో పెట్టి క్లయింట్ ఇచ్చే ప్రెజెంటేషన్ వైపు ద్రుష్టి మరల్చాను ..నా ఎదురుగ మా డైరెక్టరు నన్ను నా ఫోన్ని మార్చి మార్చి చూస్తున్నాడు.మీటింగ్ అయిపోయిన తర్వాత నీకు క్లాసు ఉందన్న ఆయన ఫీలింగ్స్ నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి..తర్వాత మొబిలిటీ మీద నా ప్రెజెంటేషన్ ఆ తర్వాత మధ్యాహ్న భోజన విరామం..అందరికీ తెలిసిందే విరామం ముందు మన జనాల మూడు ఎలా వుంటుందో ..నా బాధ అదే..రాక రాక వచ్చిన అవకాశం ..అందరి కళ్ళలో నా ప్రతిభ పడే అవకాశం ఇలా దెబ్బ తీస్తుందని ఊహించలేదు..ఎలాగొలా ముగించేసి లాప్టాప్ ను భుజాన వేస్కొని కాంటీన్ వైపు పరుగు తీసాను..
అప్పుడు గుర్తొచ్చింది నా ఫోన్ సంగతి..చూస్కుంటే పది మిస్స్డ్ కాల్స్ ..ఎదో తెలియని నంబరు అది..సరే అని ఆ నంబరికి కాల్ చేసాను..అవతలి నుండి ఎవరో పెద్దమనిషి కంఠం..
" నా పేరు రంగారావు బాబు .మీ మామయ్య నేను ఒకే కాలేజీ లో పని చేస్తాము..నేను ఎకనామిక్స్ చెపుతాను..( ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నాడు రా బాబు అసలు విషయానికి రాక అని అనుకుంటుండగానే)
మా అబ్బాయి ఇంజనీరింగ్ పాసయ్యడు"..అనగానే ఇక నేననందుకున్నా
"చూడండి రావుగారు మా ఆఫీసులో రిక్రూట్మెంట్ ఫ్రీజు జరుగుతున్నది అంటే ఇంకా కొన్ని నెలల వరకు ఎవరిని ఉద్యోగాల్లో తీసుకోరు "
అవతలి నుండి ఒక చిన్న నిట్టూర్పు ..
"అది కాదు బాబు నేను ఈ రోజే హైదరాబాదు వచ్చాను .."
మళ్ళీ నేనందుకున్నా ఒకమాట ఫోన్ చేసి వస్తే నేను ఇంకా ఎక్కడన్న తెలిసిన కంపెనీ లో చూసేవాడినండీ..
"నేను అందుకు రాలేదు బాబు మా అబ్బాయి ఈ రోజు మైక్రో సాఫ్టు లో జాయిన్ అవుతున్నాడు ..( విషయం తెలుసు కోకుండా అతిగా మాట్లాడానా అని మనసులో నేను అనుకొంటుండగానే )
"వాడు చిన్నవాడు కదా అని నేనూ తోడు వచ్చా..నువ్వూ ఇక్కడ దగ్గరలొనే చేస్తున్నావని తెలిసింది..ఒకసారి చూసి పోదామని "..
అబ్బా నన్ను చూసి పోయేదెంటిరా అనుకుంటూ..నేను ఈ రోజు చాలా బిజీ గా ఉన్నానండీ ..మీరు తిరుపతి ఎప్పుడు వెళుతున్నారు అన్నా,.
"ఈ రోజు రాయలసీమ కి వెళుతున్నా..లింగంపల్లిలో ఆగుతుందని చెప్పారు ఇక్కడికి దగ్గర కదా ..అక్కడే ఎక్కుతాను"
సరే నండి వీలుంటే కలుస్తాను అని చెప్పా..
***************************************************************************
సాయంత్రం 4 గంటలకే ఆ రోజు మీటింగ్స్ అయిపోవటంతో మా క్లయింట్ని నోవోటెల్ లో డ్రాప్ చేసి మామయ్యాకి రావు గారితో ఏమన్నా ఇచ్చి పంపిస్తే బాగుంటుందని పండ్లు , స్వీట్స్ తీస్కొని లింగంపల్లి వైపు దారి తీసాను ..మా క్లయింటుని ఇంప్రెస్స్ చెయ్యటానికి వేస్కొన్న వేషం అలానే వుంది..ష్టేషన్ దగ్గరకు రాగనే రావుగార్కి ఫొన్ చేసాను..ఆయన గోంతులో సంతోషం తెలుస్తూనే వుంది..
"మీరేనా రావుగారంటే" ..అవును బాబు నేనే..
డిస్టరబ్ చేసుంటే సారీ అన్నారు.."అదేమి లేదండీ పని వొత్తిడి అంతే" అన్నా నేను..
మీ మామయ్యగారేమన్న పోన్ చేసారా ?
లేదండీ ఆయన కూడా బిజీ నే కదా ..
మీ అబ్బాయి ని గురించి నిశ్చింత గా ఉండండి ..ఏమన్నా అవసరం అయితే నాకు కాల్ చెయ్యమని చెప్పండి ..అన్నాను..
ఆయన మొహంలో చిరునవ్వు తొణికి చూస్తుంది..
"ఇంకేమిటి బాబు సంగతులు అన్నారు"
ఏమని చెప్తాము ..మీ ట్రైను తొందరగా వస్తే ఇంటికెల్లి నా అత్మారాముడి ని శాంతింపచేస్తా అని అందామనుకొని ఆగిపొయ్యా..
ఆయన చూపులు నా చేతిలో వున్న పండ్ల మీదకి మళ్ళినట్లు గమనించి ..ఆయనకి అవి ఇచ్చి నేను మట్లాడే లోపల ఆయన .."పర్లేదు బాబు ఇప్పుడు ఇవన్ని ఎందుకు " అన్నారు..
"పర్లేదు తీస్కోండి " అని చెప్పాను..
"ఆయన ఎదో చెప్పటానికి బాగా సంశ ఇస్తున్నట్టుగా నాకు తోచింది
"ఏమన్నా చెప్పాలా మీ మామయ్యతో " అన్నారు..
"పర్లేదు అండి నేను రాత్రి కి కాల్ చేస్తాను అని చెప్పా..
అంతలో నే ట్రైను రావటం ఆయన ఎక్కటం వెళ్ళటం జరిగాయి..

హమ్మయ్య అని ఊపిరి తీస్కొని ఇంటికి బయల్దేరాను..

**************************************************************************************

కొన్ని రోజుల తర్వాత::

ఏమండి మా నాన్న వస్తున్నట్టు మీకు ముందరే తెలుసా ..టిప్ టాప్ గా తయారయ్యి వచ్చారట ..నాన్న మీగురించి ఆ రోజు ఒకటే పొగడటం ఎంత మర్యాద ! ఎంత వినయ విధేయత! అని..పెద్దల వద్దకు వచ్చేటప్పుడు ఉత్తి చేతులతో రాకూడదనే ప్రాధమిక విషయం అబ్బాయికి బాగాతెలుసు అని..
**************************************************************************************
ఇది నిఝంగా నిజం కాదు :: కధే !!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి