
టింగ్..టింగ్..ఆకాశవాణి విజయవాడ ..ఇప్పుడు భక్తి సంగీతం వింటారు..
ఇలా మొదలయ్యే నా చిన్నప్పటి రోజులు..
రేడియోలో వచ్చే కార్యక్రమాలతో నా నిత్యక్రు(ఇక్కడ పెట్టాల్సిన సరైన వత్తు లేఖిణిలో లేదు)త్యాలు అనుసంధానం అయిపొయేవి..
సమయం 6 గంటల 45 నిమిషాలు..ఇప్పుడు పాడి పంటలు..అని వినగానే స్నానానికి పరుగు..
ఏమి రామయ్యా దీర్ఘంగా అలోచిస్తున్నావు ..చార్మినార్ రేకులు..
నువాక్రాన్ ..ఆ తర్వాత..
రైతుకు చెలిమి పంటకు బలిమి నాగార్జునా యూరియా..
ప్రాంతీయ వార్తలు..
ఆకాశ వాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది .............
................................................................................................................................
ఇయం ఆకాశవాణి సంస్క్రుత వార్తాహః శూయనితాం ..ప్రవాచికా బలదేవానందసాగర . అనగానే ట్యూషన్ కి పరుగులు..
దీనికి మేము ఒక పేరడి..ఇలా..
ఇయం ఆకాశవాణి సంస్క్రుత వార్తాహః శూయనితాం ..ప్రవాచికా బలదేవానందసాగర..ప్రధాన మంత్రి నామ్నీం నాం ఇందిరాగాంధీ నమో నమః..ఇచ్చం విమానం పుచ్చయతిః ము.... మూడున్నర భవంతుః..
ఆ తర్వాత వచ్చే సంస్క్రుత పాఠం..దాని ముందు వచ్చే ఒక శ్లోకం ..చాల బాగుంటుంది..
తర్వాత ఏప్పుడొ మళ్ళీ ఆకాశవాణి విజయవాడ ..జనరంజని శ్రోతలు కోరిన తెలుగు చిత్రగీతాలు అన్నప్పుడు రేడియో వినేవాడిని..అలా పాటలూ వింటూ భోజనం ముగించి స్కూలికి పరుగు..
మళ్ళీ కార్మికుల కార్యక్రమం , ప్రాంతీయ వార్తలు ..స్కూలు కి డుమ్మా కొడితే మధ్యాహ్న బాలల కార్య క్రమం..
ఇక స్కూల్లో ఊపిరి సలపని చదువులు ..డ్రిల్లు..ఎన్ సి సి ..ఇంటికి చేరి మళ్ళీ ట్యూషన్ ..
ఇక రాత్రికి ఇంటికి చేరి భొజనం ముగించి శ్రధ్ధగా మళ్ళీ రేడియో..
ఆకాశవాణి ..ఇప్పుడు నీరాజనం శీర్షికన "ఆఖరి ఫొరాటం" చిత్రం పై సమీక్ష వింటారు..అలా ఆ చిత్రం లోని పాటలు కొన్ని డైలాగులు వేసేవారు..
ఆ కార్యక్రమం వింటూ నిద్రలోకి జారుకునే వాళ్ళం..
ఇలా రేడియో మా దినచర్యలో ఒక భాగంగా ఉండేది..
( పై చిత్రం గూగుల్ మఱియు సరాహ్నా.వర్డుప్రెస్సు.కాం వారి సౌజన్యముతో )