ప్లే గ్రూప్ లో వేసి మూడునెలలు తిరగకుండానే పరీక్షలుట మా వాడికి..పోయిన వారాంతం కష్టపడి మా వాడిని కూర్చోపెట్టి పరీక్షలో అడిగే మూడు ప్రశ్నలు బాగా చదివించి :) ఎలాగొలా ఆ టాస్క్ పూర్తి చేశాను..
ఆదివారం బాగా తెలిసిన వారు , దగ్గరి బంధువులు ఇంటికి వస్తే వారి ముందు మా వాడి ప్రతిభను ప్రదర్శించే అవకాశం వచ్చిందని బాగా ఆనందపడ్దాను..
పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినంతనే కాదని జనులా పుత్రుని పొగుడుతుంటే కలుగుతుందని చిన్నఫ్ఫుడు చదువుకున్న బద్దెన గారి పద్యం జ్ఞప్తి కి తెచ్చుకొని ..మా వాడిని కదలకుండా అందరి ముందు కూర్చో పెట్టేసరికి తల ప్రాణం తోకకి వచ్చింది..ఇక అట్టే సమయం వ్రుధా చెయ్యకుండా వాడిని ప్రశ్నలు అడగటం మొదలుపెట్టా ..
మొదటి ది , రెండవది సరిగానే చెప్పాడు.. ఇక అత్యంత క్లిష్టమైన ప్రశ్న :
నేను: which class are you studying?
మావాడు : i am in....
కొంచెం విజయ గర్వంతో రెట్టించిన ఉత్సాహంతో మళ్ళి అడిగా
నేను: which class are you studying?
మావాడు:i am in....
మొత్తం చెప్పమ్మా :
మా వాడు:i am in....
అంతే చెప్పేయ్
మావాడు:i am in....
నేను : అందరూ ఉన్నారు కదా కొంచెం సిగ్గు పడుతున్నాడు :
మావాడు: అహా కాదు...
ఎక్కడొ అడుగు మాడుతున్న వాసన :)
మావాడు:i am a complan boy..
డింగ్ అని అక్కడినుండి మాయం అయిపొయ్యా ..
నేనైతే మీ వాడికి వందకి వంద మార్కులేసి ప్లే గ్రూపు పిల్లలకు పరీక్షలు పెట్టే స్కూలు వాళ్ళకి ఉరిశిక్ష వేయాలని ఆర్డరేస్తా
రిప్లయితొలగించండిసుజాతగారు ఇది చాలా చిన్న మౌఖిక పరీక్ష ..హైదరాబాదులోని కొన్ని స్కూల్స్ నిర్భంధ విద్యావిధానాన్ని ప్రోత్సహించవు..ఎదో ఆడుతూ పాడుతూ చదువు అనే కాంసెప్ట్ స్కూల్లొ మా వాడిని వేశాను...అందుకని మీ ఉరి శిక్ష ఈ స్కూల్‌కి వర్తించదని భావిస్తూ..:))
రిప్లయితొలగించండిభార్యా భర్తలిద్దరూ ఉద్యోగస్థులైతే పిల్లలని డే కేర్ లోనో, ప్లే స్కూల్లోనో వేయక తప్పదు. దాదాపుగా హైద్రాబాదులోని ప్లే స్కూళ్ళ సంగతులన్నీ బాగా స్టడీ చేశానండీ! మా అమ్మాయి కూడా పేద్ద పేరున్న ప్లే స్కూలుకే వెళ్ళింది. అసలు ప్లే స్కూలు విధానమే మూర్ఖత్వమనిపిస్తుంది నాకు.(మరి మీరెందుకు వేశారంటారా? అప్పట్లో నాదీ తప్పని సరి పరిస్థితే! ఆ తర్వాత ఉద్యోగం మానేసి పాపకోసమే ఇంట్లో ఉండిపోయా..) కనీసం నాలుగేళ్ళ వరకూ పిల్లలు అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతూ హాయిగా గడపాల్సిందే అని నా నమ్మకం..అభిప్రాయం...వగైరాలు!
రిప్లయితొలగించండిప్లే స్కూల్లో కూడా పిల్లలు ఇష్టం లేకుండానే ఉంటారు తెలుసా! మిగతా పిల్లలతో ఆటలు ఆడినా హుషారుగా ఉన్నా మనసులో ఒక ఖాళీ తనం అలాగే ఉండిపోతుంది. అది ఎవరూ పూడ్చలేనిది.
ఇదంతా మిమ్మల్ని నిరుత్సాహపరచాలని రాయలేదు. పిల్లల గురించి ఎప్పటికీ స్టడీ చేస్తూనే ఉంటానండీ నేను. ఈ లింక్ చదవండి వీలైతే!
http://manishi-manasulomaata.blogspot.com/2008/09/blog-post_29.html
సుజాత గారు మీ పోస్ట్ మరియు ఎనాలసిస్ చాలా బాగుంది..మీతో నేను 100% ఏకీభవిస్తాను..మాది సరిగ్గా మీ పరిస్తితే....ఏదో రోజుకి 2 లేదా 3 గంటలు తన యీడు పిల్లలతో ఆడుకుంటూ , ఇంటెరాక్షన్ పెంచుకుంటాడని పంపించటమే..ఇంటి దగ్గర ఆ అవకాశం లేదు....
రిప్లయితొలగించండిమీ వాడు ముళ్ళపూడి వారి "బుడుగు" ను తలపించాడండి
రిప్లయితొలగించండిఅయినా ఇప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించే విద్యాసంస్థలు ఎన్ని ఉన్నాయండి
పంచతంత్ర లో విష్ణుశర్మ రాకుమారులకు సిలబస్ కథల రూపం లో చెప్పినట్లుగా
జిడ్డు కృష్ణముర్తి గారి రిషి వ్యాలి స్కూల్ లో పిల్లలకు సిలబస్ ని ప్రాక్టికల్ గా
తోటల్లోనూ, జనవాసాలలోను చూపించినట్ట్లుగా
పిల్లలకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించే బళ్ళు మన రాష్ట్రం లో ఎన్ని ఉన్నాయి సార్!
అయినా మీ టపా సూపరో సూపర్ !