25, ఏప్రిల్ 2011, సోమవారం

సాయి భజనావళి


సాయి మహాదేవా సత్యసాయి మహాదేవా
సాయి మహాదేవా సత్యసాయి మహాదేవా

నిరుపమగుణసదనా సాయి నీరజదళనయనా
విభూతి సుందరహే సాయి బాబ మహేశ్వరహే

20, ఏప్రిల్ 2011, బుధవారం

ఆవకాయ పెట్టడం ఎలా?

నాలుగైదు సంవత్సరాల క్రితం "ఆవకాయ పెట్టడం ఎలా? " అని ఒక ఆర్కుట్ అక్కయ్యని అడిగినప్పుడు , ఆమె ఆవకాయ పెట్టడం అంటే అంత వీజీ కాదు బంగారూ..దానికి చాలా హడావిడి చెయ్యాలి అని ఇలా చెప్పారు ..

"మాంచి పుల్ల మామిడి కాయలు కోసుకు రమ్మని తొట వీరన్న తొ చెప్పా నిన్న" ..

మన పాలేరు సుబ్బడికి "ముక్కలు తరగాలిరా" అనిచెప్పి పొద్దున్నె చద్దన్నం పెట్టేశా..

మరిది శేఖరం ఆవ పిండి, కారం మిల్లు పట్టించడానికి వెళ్ళాడు ఇందాకే..

మా పిఠాపురం పిన్నత్త గారు ఉప్పు ఎండ లో పొసేశారు ..

ఇక కమలమ్మొదిన, సామ్రాజ్యం ఇంట్లొ పని అవ్వగానే వచ్చేస్తామన్నారు.. ముక్కలు తుడిచి జాడీ కి ఎత్తడానికి..

హయ్యొ నా మతి మండా... మరిచేపొయ్యా...

జాడీలు సుధ్ధి చెయ్యనే లేదే..

మా మంచి సత్యనారాయణ మూర్తివి కదూ.. కాస్త అటకెక్కి జాడీలు దించు బంగారూ"..


--- అక్కగారికి ప్రణామాలు ..

21, మార్చి 2011, సోమవారం

అలా అయిందన్నమాట

ప్లే గ్రూప్ లో వేసి మూడునెలలు తిరగకుండానే పరీక్షలుట మా వాడికి..పోయిన వారాంతం కష్టపడి మా వాడిని కూర్చోపెట్టి పరీక్షలో అడిగే మూడు ప్రశ్నలు బాగా చదివించి :) ఎలాగొలా ఆ టాస్క్ పూర్తి చేశాను..

ఆదివారం బాగా తెలిసిన వారు , దగ్గరి బంధువులు ఇంటికి వస్తే వారి ముందు మా వాడి ప్రతిభను ప్రదర్శించే అవకాశం వచ్చిందని బాగా ఆనందపడ్దాను..
పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినంతనే కాదని జనులా పుత్రుని పొగుడుతుంటే కలుగుతుందని చిన్నఫ్ఫుడు చదువుకున్న బద్దెన గారి పద్యం జ్ఞప్తి కి తెచ్చుకొని ..మా వాడిని కదలకుండా అందరి ముందు కూర్చో పెట్టేసరికి తల ప్రాణం తోకకి వచ్చింది..ఇక అట్టే సమయం వ్రుధా చెయ్యకుండా వాడిని ప్రశ్నలు అడగటం మొదలుపెట్టా ..
మొదటి ది , రెండవది సరిగానే చెప్పాడు.. ఇక అత్యంత క్లిష్టమైన ప్రశ్న :

నేను: which class are you studying?
మావాడు : i am in....

కొంచెం విజయ గర్వంతో రెట్టించిన ఉత్సాహంతో మళ్ళి అడిగా
నేను: which class are you studying?
మావాడు:i am in....

మొత్తం చెప్పమ్మా :

మా వాడు:i am in....



అంతే చెప్పేయ్


మావాడు:i am in....

నేను : అందరూ ఉన్నారు కదా కొంచెం సిగ్గు పడుతున్నాడు :

మావాడు: అహా కాదు...

ఎక్కడొ అడుగు మాడుతున్న వాసన :)

మావాడు:i am a complan boy..


డింగ్ అని అక్కడినుండి మాయం అయిపొయ్యా ..

25, జనవరి 2011, మంగళవారం

ఇది నిఝంగా కధే !!

మళ్ళీ అదే నంబరునుండి ఫోను..ఇది రావటం ఈ రొజు పదో సారి..ఆఫీసులో వరుస క్లయింట్ విజిట్ లతో సతమతమవుతూ ఊపిరి సలపనంత పనితో ఉన్నప్పుడే ఈ ఫోన్లు కూడా..ఫోన్ని సైలెంట్ మోడ్ లో పెట్టి క్లయింట్ ఇచ్చే ప్రెజెంటేషన్ వైపు ద్రుష్టి మరల్చాను ..నా ఎదురుగ మా డైరెక్టరు నన్ను నా ఫోన్ని మార్చి మార్చి చూస్తున్నాడు.మీటింగ్ అయిపోయిన తర్వాత నీకు క్లాసు ఉందన్న ఆయన ఫీలింగ్స్ నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి..తర్వాత మొబిలిటీ మీద నా ప్రెజెంటేషన్ ఆ తర్వాత మధ్యాహ్న భోజన విరామం..అందరికీ తెలిసిందే విరామం ముందు మన జనాల మూడు ఎలా వుంటుందో ..నా బాధ అదే..రాక రాక వచ్చిన అవకాశం ..అందరి కళ్ళలో నా ప్రతిభ పడే అవకాశం ఇలా దెబ్బ తీస్తుందని ఊహించలేదు..ఎలాగొలా ముగించేసి లాప్టాప్ ను భుజాన వేస్కొని కాంటీన్ వైపు పరుగు తీసాను..
అప్పుడు గుర్తొచ్చింది నా ఫోన్ సంగతి..చూస్కుంటే పది మిస్స్డ్ కాల్స్ ..ఎదో తెలియని నంబరు అది..సరే అని ఆ నంబరికి కాల్ చేసాను..అవతలి నుండి ఎవరో పెద్దమనిషి కంఠం..
" నా పేరు రంగారావు బాబు .మీ మామయ్య నేను ఒకే కాలేజీ లో పని చేస్తాము..నేను ఎకనామిక్స్ చెపుతాను..( ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నాడు రా బాబు అసలు విషయానికి రాక అని అనుకుంటుండగానే)
మా అబ్బాయి ఇంజనీరింగ్ పాసయ్యడు"..అనగానే ఇక నేననందుకున్నా
"చూడండి రావుగారు మా ఆఫీసులో రిక్రూట్మెంట్ ఫ్రీజు జరుగుతున్నది అంటే ఇంకా కొన్ని నెలల వరకు ఎవరిని ఉద్యోగాల్లో తీసుకోరు "
అవతలి నుండి ఒక చిన్న నిట్టూర్పు ..
"అది కాదు బాబు నేను ఈ రోజే హైదరాబాదు వచ్చాను .."
మళ్ళీ నేనందుకున్నా ఒకమాట ఫోన్ చేసి వస్తే నేను ఇంకా ఎక్కడన్న తెలిసిన కంపెనీ లో చూసేవాడినండీ..
"నేను అందుకు రాలేదు బాబు మా అబ్బాయి ఈ రోజు మైక్రో సాఫ్టు లో జాయిన్ అవుతున్నాడు ..( విషయం తెలుసు కోకుండా అతిగా మాట్లాడానా అని మనసులో నేను అనుకొంటుండగానే )
"వాడు చిన్నవాడు కదా అని నేనూ తోడు వచ్చా..నువ్వూ ఇక్కడ దగ్గరలొనే చేస్తున్నావని తెలిసింది..ఒకసారి చూసి పోదామని "..
అబ్బా నన్ను చూసి పోయేదెంటిరా అనుకుంటూ..నేను ఈ రోజు చాలా బిజీ గా ఉన్నానండీ ..మీరు తిరుపతి ఎప్పుడు వెళుతున్నారు అన్నా,.
"ఈ రోజు రాయలసీమ కి వెళుతున్నా..లింగంపల్లిలో ఆగుతుందని చెప్పారు ఇక్కడికి దగ్గర కదా ..అక్కడే ఎక్కుతాను"
సరే నండి వీలుంటే కలుస్తాను అని చెప్పా..
***************************************************************************
సాయంత్రం 4 గంటలకే ఆ రోజు మీటింగ్స్ అయిపోవటంతో మా క్లయింట్ని నోవోటెల్ లో డ్రాప్ చేసి మామయ్యాకి రావు గారితో ఏమన్నా ఇచ్చి పంపిస్తే బాగుంటుందని పండ్లు , స్వీట్స్ తీస్కొని లింగంపల్లి వైపు దారి తీసాను ..మా క్లయింటుని ఇంప్రెస్స్ చెయ్యటానికి వేస్కొన్న వేషం అలానే వుంది..ష్టేషన్ దగ్గరకు రాగనే రావుగార్కి ఫొన్ చేసాను..ఆయన గోంతులో సంతోషం తెలుస్తూనే వుంది..
"మీరేనా రావుగారంటే" ..అవును బాబు నేనే..
డిస్టరబ్ చేసుంటే సారీ అన్నారు.."అదేమి లేదండీ పని వొత్తిడి అంతే" అన్నా నేను..
మీ మామయ్యగారేమన్న పోన్ చేసారా ?
లేదండీ ఆయన కూడా బిజీ నే కదా ..
మీ అబ్బాయి ని గురించి నిశ్చింత గా ఉండండి ..ఏమన్నా అవసరం అయితే నాకు కాల్ చెయ్యమని చెప్పండి ..అన్నాను..
ఆయన మొహంలో చిరునవ్వు తొణికి చూస్తుంది..
"ఇంకేమిటి బాబు సంగతులు అన్నారు"
ఏమని చెప్తాము ..మీ ట్రైను తొందరగా వస్తే ఇంటికెల్లి నా అత్మారాముడి ని శాంతింపచేస్తా అని అందామనుకొని ఆగిపొయ్యా..
ఆయన చూపులు నా చేతిలో వున్న పండ్ల మీదకి మళ్ళినట్లు గమనించి ..ఆయనకి అవి ఇచ్చి నేను మట్లాడే లోపల ఆయన .."పర్లేదు బాబు ఇప్పుడు ఇవన్ని ఎందుకు " అన్నారు..
"పర్లేదు తీస్కోండి " అని చెప్పాను..
"ఆయన ఎదో చెప్పటానికి బాగా సంశ ఇస్తున్నట్టుగా నాకు తోచింది
"ఏమన్నా చెప్పాలా మీ మామయ్యతో " అన్నారు..
"పర్లేదు అండి నేను రాత్రి కి కాల్ చేస్తాను అని చెప్పా..
అంతలో నే ట్రైను రావటం ఆయన ఎక్కటం వెళ్ళటం జరిగాయి..

హమ్మయ్య అని ఊపిరి తీస్కొని ఇంటికి బయల్దేరాను..

**************************************************************************************

కొన్ని రోజుల తర్వాత::

ఏమండి మా నాన్న వస్తున్నట్టు మీకు ముందరే తెలుసా ..టిప్ టాప్ గా తయారయ్యి వచ్చారట ..నాన్న మీగురించి ఆ రోజు ఒకటే పొగడటం ఎంత మర్యాద ! ఎంత వినయ విధేయత! అని..పెద్దల వద్దకు వచ్చేటప్పుడు ఉత్తి చేతులతో రాకూడదనే ప్రాధమిక విషయం అబ్బాయికి బాగాతెలుసు అని..
**************************************************************************************
ఇది నిఝంగా నిజం కాదు :: కధే !!

12, నవంబర్ 2010, శుక్రవారం

ఆకాశవాణి - ఒక మధుర స్మ్రుతి



టింగ్..టింగ్..ఆకాశవాణి విజయవాడ ..ఇప్పుడు భక్తి సంగీతం వింటారు..
ఇలా మొదలయ్యే నా చిన్నప్పటి రోజులు..
రేడియోలో వచ్చే కార్యక్రమాలతో నా నిత్యక్రు(ఇక్కడ పెట్టాల్సిన సరైన వత్తు లేఖిణిలో లేదు)త్యాలు అనుసంధానం అయిపొయేవి..
సమయం 6 గంటల 45 నిమిషాలు..ఇప్పుడు పాడి పంటలు..అని వినగానే స్నానానికి పరుగు..
ఏమి రామయ్యా దీర్ఘంగా అలోచిస్తున్నావు ..చార్మినార్ రేకులు..
నువాక్రాన్ ..ఆ తర్వాత..
రైతుకు చెలిమి పంటకు బలిమి నాగార్జునా యూరియా..

ప్రాంతీయ వార్తలు..
ఆకాశ వాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది .............
................................................................................................................................

ఇయం ఆకాశవాణి సంస్క్రుత వార్తాహః శూయనితాం ..ప్రవాచికా బలదేవానందసాగర . అనగానే ట్యూషన్ కి పరుగులు..

దీనికి మేము ఒక పేరడి..ఇలా..
ఇయం ఆకాశవాణి సంస్క్రుత వార్తాహః శూయనితాం ..ప్రవాచికా బలదేవానందసాగర..ప్రధాన మంత్రి నామ్నీం నాం ఇందిరాగాంధీ నమో నమః..ఇచ్చం విమానం పుచ్చయతిః ము.... మూడున్నర భవంతుః..

ఆ తర్వాత వచ్చే సంస్క్రుత పాఠం..దాని ముందు వచ్చే ఒక శ్లోకం ..చాల బాగుంటుంది..

తర్వాత ఏప్పుడొ మళ్ళీ ఆకాశవాణి విజయవాడ ..జనరంజని శ్రోతలు కోరిన తెలుగు చిత్రగీతాలు అన్నప్పుడు రేడియో వినేవాడిని..అలా పాటలూ వింటూ భోజనం ముగించి స్కూలికి పరుగు..

మళ్ళీ కార్మికుల కార్యక్రమం , ప్రాంతీయ వార్తలు ..స్కూలు కి డుమ్మా కొడితే మధ్యాహ్న బాలల కార్య క్రమం..

ఇక స్కూల్లో ఊపిరి సలపని చదువులు ..డ్రిల్లు..ఎన్ సి సి ..ఇంటికి చేరి మళ్ళీ ట్యూషన్ ..
ఇక రాత్రికి ఇంటికి చేరి భొజనం ముగించి శ్రధ్ధగా మళ్ళీ రేడియో..
ఆకాశవాణి ..ఇప్పుడు నీరాజనం శీర్షికన "ఆఖరి ఫొరాటం" చిత్రం పై సమీక్ష వింటారు..అలా ఆ చిత్రం లోని పాటలు కొన్ని డైలాగులు వేసేవారు..
ఆ కార్యక్రమం వింటూ నిద్రలోకి జారుకునే వాళ్ళం..

ఇలా రేడియో మా దినచర్యలో ఒక భాగంగా ఉండేది..


( పై చిత్రం గూగుల్ మఱియు సరాహ్నా.వర్డుప్రెస్సు.కాం వారి సౌజన్యముతో )

8, నవంబర్ 2010, సోమవారం

టివి చానల్స్ కొత్త మార్కెటింగ్ టెక్నిక్

గ్రుహిణులని మాత్రమే టార్గెట్ చేసుకున్న టివిలో వచ్చే సీరియల్స్ ( సోప్స్) ఇప్పుడు సీనియర్ సిటిజెన్స్ ని కూడా వదలటంలేదు. అన్ని చానెల్స్ కొత్త పోకడలకి శ్రీకారం చుట్టాయి ..ఈ మధ్య మా ఇంటికి బాగా తెలిసిన వాళ్ళు వచ్చారు..అందరం కలసి కాసేపు కష్టం సుఖం మట్లాడుకోవచ్చనీ.మా వాడికి బాగా కాలక్షేపం కూడా అవుతుందని ఎంతో ఆశ పడ్డాను. కాని నా ఆశ మీద జల్ తుఫాన్ కుంభవ్రుష్టి కురిపించింది.. వారితో పలకరింపుల కార్యక్రమం అయిన వెంటనే తాతగారు ( వచ్చిన వారిలో పెద్దాయన)బాబు కొంచెం ఆ టివి పెడతావూ అన్నారు..అయ్యో తాతగారు మీరు కూడా నా అని ఒక వింత ఎక్స్ప్రెషన్ ఇచ్చి వారికి కావల్సిన చానెల్ పెట్టాను ..అంతే ఒక అరగంట సేపు ఇంట్లొ టివి సౌండు తప్ప ఇంకా ఏమి వినిపించలేదు..
నాకు చాలా ఆశ్చర్యం వేసి ఎప్పుడూ భక్తి చానెల్ చూసే మీరు ఎందుకు ఇలా మారిపోయారు అని అడగ్గా ఆయన "ఏమి చెప్తాం నాయనా ఈ సీరియల్ మొదట కాశీ అంతా చూపించాడు అలా చూస్తూ దీనికి ఎడిక్ట్ అయిపోయాం అని చెప్పుకొచ్చారు"

కొసమెరుపు: ఈ రోజు పొద్దున ఆఫీస్ కి వెళుతూ ఒక్కసారి తుఫాన్ అప్డేట్ చుద్దాం అని తొమ్మిదో చానెల్ పెట్టగానే బ్రేకింగ్ న్యూస్ చెన్నై , పుదుచ్చేరి లో భారీ వర్షాలు స్కూళ్ళకి , ఆఫీసులకి సెలవు " అని కనిపించింది..సదరు చెన్నై విలేఖరి పైన లైవు లో మట్లాడుతుంది మెరీనా బీచ్ నుండి .."ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది ఎండ కూడా వచ్చింది అని"

4, నవంబర్ 2010, గురువారం

బ్లాగులోకంలోకి నేను అడుగు పెట్టేశా

బ్లాగ్ మిత్రులందరికి వందనం..అభివందనం..

మనసుపొరల్లొ దాగిఉన్న గత కాల మధుర స్మ్రుతులు కాలంతో పాటు మర్చి పోకుండా ఇక్కడ నిక్షిప్తం చేసుకుందాం అని నా ఈ ప్రయత్నం...